హీరోగా వచ్చిన అవకాశాన్ని వదులుకుని 'ఓ బేబీ' సినిమా చేశానని కథానాయకుడు తేజ సజ్జా అన్నారు. అలాంటి సినిమానే 'జాంబీ రెడ్డి' అని చెప్పారు. ఈ చిత్రంలో రెండో, మూడో హీరోగా చేయమని చెప్పినా సరే నేను నటించేవాడినని స్పష్టం చేశారు. జాంబీలు కాన్సెప్ట్ టాలీవుడ్‌కు కొత్త. అలాంటి కథకు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ చేర్చి దీనిని తీశామని అన్నారు. కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని తెలిపారు.
'జాంబీ రెడ్డి'లో మూడో హీరోగానైనా చేసేవాడిని: తేజ - zombie reddy latest news
'ఈటీవీ భారత్'తో ముచ్చటించిన 'జాంబీ రెడ్డి' హీరో తేజ సజ్జా ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

'జాంబీ రెడ్డి'లో ఏ పాత్ర చేయమన్నా చేసేవాడిని: తేజ
Last Updated : Feb 3, 2021, 3:48 PM IST