తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూపర్​స్టార్ రజనీకాంత్​కు తప్పిన పెను ప్రమాదం - రజనీకాంత్ విమాన ప్రమాదం

సూపర్​స్టార్ రజనీకాంత్.. ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. ఆ సమయంలో రజనీతో పాటు మొత్తం 42 ప్రయాణికులు అందులో ఉన్నారు.

సూపర్​స్టార్ రజనీకాంత్​కు తప్పిన ప్రమాదం
సూపర్​స్టార్ రజనీకాంత్

By

Published : Jan 27, 2020, 1:33 PM IST

Updated : Feb 28, 2020, 3:24 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్​కు పెను ప్రమాదం తప్పింది. ఈరోజు(సోమవారం) ఉదయం చెన్నై నుంచి మైసూర్​కు వెళ్లాల్సిన విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్​ అయింది. సాంకేతిక లోపం కారణంగానే ఇది జరిగిందని పైలట్ గుర్తించాడు. క్షేమంగా తిరిగి చెన్నైలో ఆ విమానం ల్యాండ్ అయింది. ఆ సమయంలో రజనీతో పాటు మొత్తం 42 ప్రయాణికులు ఉన్నారు.

ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు రజనీ. మీనా, ఖుష్బూ హీరోయిన్లు. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్​లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే సంక్రాంతికి 'దర్బార్​'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు తలైవా.

Last Updated : Feb 28, 2020, 3:24 AM IST

ABOUT THE AUTHOR

...view details