మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమాతో పవన్‌తేజ్ కొణిదెల కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా తీసిన ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అభిరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరి పవన్ తేజ్ ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి. పవన్ తేజ్ ఇంతకుముందు 'ఖైదీ నెం.150', 'రంగస్థలం', 'వాల్మీకి' సినిమాల్లో నటించాడు.
ప్రముఖ హాస్యనటుడు సత్య కథానాయకుడిగా నటిస్తున్న తొలి సినిమా 'వివాహ భోజనంబు'. ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. సందీప్ కిషన్ నిర్మించడం సహా అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
పిసినారి సత్య సరిగ్గా లాక్డౌన్ విధించే సమయానికి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి కూతురు కుటుంబం ఇతడి ఇంట్లో చిక్కుకుపోతుంది. దీంతో సత్యకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అతడేం చేశాడు? లాంటి నిజ జీవిత సంఘటనలతో సినిమా తీసినట్లు వెల్లడించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రామ్ అబ్బరాజ్ దర్శకత్వం వహించాడు.