తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​.. 'తేరే బినా' టీజర్​ విడుదల - సల్మాన్​ తేరే బినా సాంగ్​ టీజర్​

బాలీవుడ్​ స్టార్​హీరో సల్మాన్​ ఖాన్​ నటించిన 'తేరే బినా' మ్యూజికల్​ వీడియో టీజర్​ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. మే 12న పూర్తి వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపాడు సల్మాన్​.

Teaser of Salman Khan starrer Tere Bina out now!
సల్మాన్​.. 'తేరే బినా' టీజర్​ విడుదల

By

Published : May 11, 2020, 1:46 PM IST

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో 'తేరే బినా' మ్యూజికల్​ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపాడు. మే 12న పూర్తి వీడియో విడుదల చేయనుండగా.. మదర్స్​ డే సందర్భంగా దానికి సంబంధించిన టీజర్​​ను ట్విట్టర్​లో విడుదల చేశాడీ కండల వీరుడు. ఇందులో బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ నటించింది.

లాక్​డౌన్ విధించినప్పటి నుంచి ముంబయికి కొంచెం దూరంలో ఉన్న తన ఫామ్​హౌస్​లో ఉంటున్నాడు సల్మాన్. ఇతడితో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, టీవీ వ్యాఖ్యాత లూలియ వంతూర్ తదితరులు అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతానికి దగ్గర్లోని గ్రామ ప్రజలకు, ఈ మధ్యే నిత్యావసర సామాగ్రిని అందజేశాడీ కథానాయకుడు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రాధే'లో సల్మాన్ నటిస్తున్నాడు.

ఇదీ చూడండి.. జాక్వెలిన్​తో కలిసి పాటపాడిన సల్మాన్

ABOUT THE AUTHOR

...view details