'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో భాగంగా హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, నటుడు అజయ్ దేవ్‌గణ్.. పలు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. అభిమానులు ఎక్కువగా బయట తిరగొద్దని, వ్యాక్సినేషన్ విషయంలో ఆలస్యం చేయొద్దని అన్నారు. ఈ వైరస్ ఎదుర్కొనే విషయంలో అందరం కలిసికట్టుగా పోరాడదామని పేర్కొన్నారు. మాస్క్ పెట్టుకోవడం సహా సామాజిక దూరం కూడా పాటించాలని తెలిపారు.
'ఆర్ఆర్ఆర్' ప్రత్యేక వీడియో.. కరోనా కట్టడిపై అవగాహన - మూవీ న్యూస్
కరోనా కట్టడి గురించి 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా అభిమానులు, ప్రజలకు.. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పలు సూచనలు ఇచ్చారు.
ఈ వీడియోలో ఆలియా తెలుగులో, రామ్చరమ్ తమిళంలో, ఎన్టీఆర్ కన్నడలో, రాజమౌళి మలయాళంలో, అజయ్ దేవ్‌గణ్ హిందీలో మాట్లాడారు.
'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ చేస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న థియేటర్లలోకి రానుందీ చిత్రం.