తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''రివాల్వర్ దాదీ'స్​ నుంచి చాలా నేర్చుకున్నా' - షూటర్స్ చంద్రో, ప్రకాశీ తోమర్

తాప్సీ, భూమీ పడ్నేకర్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'సాంద్ కీ ఆంఖ్'. షూటర్స్ చంద్రో, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రీకరణకు ముందు ప్రకాశీ, చంద్రోలతో గడపడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది తాప్సీ.

తాప్సీ

By

Published : Jul 31, 2019, 7:32 PM IST

షూటర్స్ చంద్రో, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'సాంద్​​ కి ఆంఖ్'. ఇందులో హీరోయిన్​గా నటించిన తాప్సీ చిత్రీకరణకు ముందు వారిద్దరితో సరదాగా గడిపానని, ఆ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నానంటోంది. తుషార్ హిరా నందాని దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశీ పాత్రను తాప్సీ, చంద్రో పాత్ర భూమి పడ్నేకర్ పోషించారు.

'"ఉత్తర ప్రదేశ్​లోని జోహ్రికి వెళ్లి చంద్రో, ప్రకాశీలతో గడిపాను. వీరిద్దర్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఈ సమయం నాకెంతో ఉపయెగపడింది. అక్కడే ఉండి, వారి కుటుంబంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. -తాప్సీ, హీరోయిన్

సినిమా చిత్రీకరణకు వారి నుంచే దుస్తులు, వస్తువులు తెచ్చుకున్నట్లు తెలిపింది తాప్సీ. దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా వస్తోన్న 'మంగళ్​యాన్' సినిమాలోనూ నటిస్తోంది తాప్సీ. ఈ మూవీ ఆగస్టు 15న విడుదలవనుంది.

ఇది సంగతి: 'సాహో' నటి ఫేవరేట్ హీరో ప్రభాస్ కాదట..!

ABOUT THE AUTHOR

...view details