తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హిందీలో మాట్లాడమంటే కౌంటర్ ఇచ్చిన తాప్సీ​ - IFFI Goa 2019

'ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో పాల్గొన్న హీరోయిన్​ తాప్సీని హిందీ మాత్రమే మాట్లాడాలని అడిగిన ఓ వ్యక్తికి సరైన కౌంటర్​ ఇచ్చిందీ భామ. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

హీరోయిన్ తాప్సీ పన్ను

By

Published : Nov 24, 2019, 3:36 PM IST

హీరోయిన్​ తాప్సీ.. తనపై విమర్శలు చేసే వారికి ఘాటైన సమధానాలివ్వడంలో ముందుంటుంది. తాజాగా అలాంటిదే మరో సంఘటన జరిగింది. గోవాలోని 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియా' వేడుకలో పాల్గొన్న తనను, హిందీలో మాట్లాడమని చెప్పిన ఓ వ్యక్తికి కౌంటర్​ ఇచ్చి అతడి నోరు మూయించింది.

అసలేం జరిగింది?

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులతో ముఖాముఖీలో పాల్గొంది తాప్సీ. ఆ సమయంలో పూర్తిగా ఇంగ్లీష్​లోనే మాట్లాడింది. ఆ విషయం నచ్చని ఓ వ్యక్తి.. ఆంగ్లంలో కాకుండా హిందీలో మాట్లాడాలని కోరాడు. ఇక్కడున్న అందరికీ హిందీ రాకపోవచ్చని, సదరు వ్యక్తికి సమాధానమిచ్చింది. అయినప్పటికీ మీరు హిందీ నటి కాబట్టి హిందీలో మాట్లాడాలని అతడు పట్టుబట్టాడు.

దీనిపై స్పందించిన తాప్సీ.. తను దక్షిణాది నటిని అని చెప్పింది. తెలుగు, తమిళంలో మాట్లాడితే సమ్మతమేనా అంటూ అతడికి ఎదురు ప్రశ్న వేసింది. ఈ వ్యాఖ్యతో ఆ వ్యక్తి మళ్లీ మాట్లాడలేకపోయాడు. తాప్సీ ప్రశ్నకు ఇతర ప్రేక్షకులూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు.

ఇది చదవండి: దక్షిణాది ప్రేక్షకులకు సినిమాపై అంతులేని ప్రేమ: హీరోయిన్ తాప్సీ

ABOUT THE AUTHOR

...view details