మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బీటౌన్ బ్యూటీ తాప్సీ(rashmi rocket release date ). కథానాయిక అంటే కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదని నిరూపిస్తూ తరచూ విభిన్న కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఆమె నటించిన సరికొత్త చిత్రం 'రష్మీ రాకెట్'(taapsee pannu rashmi rocket). గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీ పాత్రను తాప్సీ పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మహిళలను చులకనగా చూసే సమాజం నుంచి వచ్చి క్రీడల్లో తన సత్తా చాటిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటన అదరగొట్టేలా ఉంది. క్రీడల్లో రాణిస్తున్న తరుణంలో లింగనిర్ధారణ పరీక్షల కారణంగా ఆమె జీవితం ఏవిధంగా మారింది? ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? న్యాయస్థానం ఎదుట ఆమె ఎలా గెలిచింది? అనే విషయాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 15న జీ5 ఓటీటీ వేదికగా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్కీ కౌశల్(vicky kaushal new movie) కీలక పాత్రలో సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ డ్రామా 'సర్దార్ ఉద్దమ్'(sardar udham release date). విక్కీ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతోంది. అయితే, థియేటర్‌లో కాదు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో(sardar udham amazon) వేదికగా అక్టోబరులో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు, అమెజాన్ ప్రైమ్ కూడా ప్రకటించింది.