తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ తాప్సీకి ట్రాఫిక్​ పోలీసుల జరిమానా - Tapsee fined by mumbai police for not wearing helmet

హెల్మెట్​ లేకుండా బైక్​ రైడింగ్​ చేసినందుకు హీరోయిన్​ తాప్సీకి ముంబయి పోలీసులు జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అభిమానులను ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించవద్దని కోరింది.

Tapsee
తాప్సీ

By

Published : Nov 18, 2020, 7:26 PM IST

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి పన్ను జరిమానా పడింది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు తనకు ఫైన్‌ పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే తాప్సీ.. కాస్త తీరిక సమయం దొరకడం వల్ల బైక్‌ నడిపింది. అయితే.. హెల్మెట్‌ లేకుండా రోడ్లపై తిరిగినందుకు ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ఆమెకు జరిమాన విధించారు. అభిమానులు మాత్రం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆమె కోరింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దానికి ఆమె వాహనం నడిపిస్తున్న ఫొటోను కూడా జతచేసింది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటోందీ దిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ భామ ఇటీవల కాలంలో బీటౌన్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వరుస హిట్​లను కొడుతుంది. తన తర్వాతి సినిమాలో బ్యాట్మింటన్‌ క్రీడాకారిణిగా అభిమానుల ముందుకు రానుంది. గుజరాత్‌కు చెందిన షట్లర్‌ రష్మీ జీవిత కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం. అందుకోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ చెమటోడుస్తోంది. ఆ సినిమా తర్వాత భారత మహిళా క్రికెటర్‌ మిథాలిరాజ్‌ పాత్ర జీవిత కథ ఆధారంగా రానున్న 'శెభాష్‌ మిథూ' సినిమాతో ఆమె క్రికెటర్‌ అవతారమెత్తనుంది.

ఇదీ చూడండి : 'హీరో భార్యలకు నచ్చక అవకాశాలు కోల్పోయా'

ABOUT THE AUTHOR

...view details