తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Tapsee: టీవీలో ఆ సీన్స్​ వస్తే నన్ను కిచెన్​లోకి పంపేవారు! - ముద్దు సన్నివేశాల గురించి తాప్సీ

తాప్సీ(Tapsee) హీరోయిన్​గా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'హసీన్ దిల్​రుబా' (Haseen Dillruba) నెట్​ఫ్లిక్స్​లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్​లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఫ్యామిలీతో ముద్దు, శృంగార సన్నివేశాలు చూడటం ఇబ్బందిగా ఉంటుందని వెల్లడించింది.

Tapsee
తాప్సీ

By

Published : Jul 3, 2021, 8:32 AM IST

నటి తాప్సీ(Tapsee) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'హసీనా దిల్‌రుబా'(Haseen Dillruba). వినీల్‌ మాథ్యూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్‌, హర్షవర్థన్‌ కీలకపాత్రలు పోషించారు.తాజాగా నెట్​ఫ్లిక్స్​లో విడుదలైందీ చిత్రం. ఈనేపథ్యంలో ప్రమోషన్‌లో పాల్గొన్న తాప్సీ షూటింగ్ సమయంలో తన అనుభవాలను పంచుకుంది. షూట్‌ ఎంతో సరదాగా సాగిందని.. కాకపోతే ముద్దు, శృంగార తరహా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కాస్త ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీతో కలిసి హాలీవుడ్ సినిమాలు చూసినప్పటి అనుభవాలు పంచుకుంది.

"నేను టీనేజీలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒకే టీవీ ఉండేది. మా నాన్నకు హాలీవుడ్‌ సినిమాలు చూడడమంటే ఇష్టం. దాంతో ఇంట్లో ఉన్న వాళ్లందరూ నాన్నతోపాటు కూర్చొని అవే సినిమాలు చూసేవాళ్లం. అలా మేమంతా సరదాగా గడిపేవాళ్లం. కానీ ఆ సినిమాల్లో ప్రేమ, ముద్దు సన్నివేశాలు వస్తే.. టీవీ ముందు కూర్చున్న మేమంతా కాస్త ఇబ్బందికి గురయ్యేవాళ్లం. దాంతో, ఇంట్లో పెద్దవాళ్లు.. మంచినీళ్లు తీసుకురమ్మని నన్ను కిచెన్‌లోకి పంపించేసేవాళ్లు. కుటుంబంతో కలిసి కొన్ని సన్నివేశాలు వీక్షించడం ఎంతైనా కష్టంగానే ఉంటుంది" అని తాప్సీ తెలిపింది.

ఇవీ చూడండి: Tejaswi Madivada: 'ఐస్​క్రీమ్​' బ్యూటీ బోల్డ్ పోజులు

ABOUT THE AUTHOR

...view details