తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫిట్​నెస్ అంటే కండలు తిరిగి ఉండటం కాదు' - రష్మి రాకెట్ వార్తలు

ఫిట్​నెస్ అంటే ఏ పని చేయడానికైనా మన శరీరం సహకరించడమే అంటోంది హీరోయిన్ తాప్సీ. 'రష్మి రాకెట్'​ కోసం కసరత్తులు చేసి ఫిట్​గా తయారైందీ నటి.

Tapsee
తాప్సీ

By

Published : Jan 28, 2021, 6:39 AM IST

"ఫిట్‌నెస్‌ అంటే కండలు తిరిగి ఉండటమే కాదు.. ఏ పని చేయడానికి అయినా మన శరీరం సహకరించడం" అంటోంది తాప్సీ. తాను నటిస్తున్న 'రష్మీ రాకెట్‌' కోసం ఎన్ని కసరత్తులు చేసిందో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఈ అమ్మడు.. బాగా ఫిట్‌గా తయారైంది.

తాజాగా ఆ చిత్ర షూటింగ్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌లో జరుగుతోంది. ఇందులో గ్రామీణ అథ్లెట్‌ అమ్మాయి పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఇక్కడ చిత్రీకరణ ముగింపు రోజు సరదాగా కొన్ని ఫొటోలు దిగింది. తెల్లని ఇసుకలో జర్కిన్‌ తీసి పుషప్స్‌ కొట్టింది. చిత్రబృందంలోని అబ్బాయిలతో పరుగుపోటీ పెట్టుకుంది. ఈ చిత్రాలను అభిమానుల కోసం ఇన్‌స్టాలో ఉంచింది.

"చూశారా ఫిట్‌నెస్‌.. శారీరకంగా, మానసికంగా అమ్మాయిలు ఇలా దృఢంగా తయారవ్వాలి" అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటి 'లూప్‌లపేట్‌'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఆకాశ్‌భాటియా దర్శకత్వం వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details