తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినీ పరిశ్రమ నుంచి అతడ్ని బహిష్కరించండి' - కొరియోగ్రాఫర్​ గణేశ్​ ఆచార్య

ప్రముఖ డాన్స్​ కొరియోగ్రాఫర్​ గణేశ్​పై నటి తనుశ్రీ దత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఇలాంటి వారిపై సినీపరిశ్రమలో నిషేధం విధించాలని డిమాండ్​ చేసింది.

Tanushree-Dutta-urges-Bollywood-to-boycott-choreographer-Ganesh-Acharya
'సినీ పరిశ్రమ నుంచి గణేశ్​ను బహిష్కరించండి'

By

Published : Jan 31, 2020, 5:24 AM IST

Updated : Feb 28, 2020, 2:52 PM IST

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యపై బాలీవుడ్‌ వెంటనే నిషేధం విధించాలని 'హారన్‌ ఓకే ప్లీజ్‌' నటి తనుశ్రీ దత్తా కోరింది. ఇటీవల గణేశ్‌ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా డ్యాన్సర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్తా ఈ విషయంపై స్పందించింది. మహిళలను వేధింపులకు గురిచేసే ఇలాంటి వ్యక్తులపై బాలీవుడ్‌తోపాటు ఇతర చిత్ర పరిశ్రమలు కూడా నిషేధం విధించాలని కోరింది.

"సినీ పరిశ్రమలో తారలందరికీ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించిన గణేశ్​.. కొత్తగా వస్తున్న వారిని వేధించడానికి తన ఫేమ్‌ను వాడుకుంటున్నాడు. ఎందరో అగ్రకథానాయకులు తాము నటించే చిత్రాల్లో గణేశ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఒకానొక సమయంలో గణేశ్‌ మంచివాడు కాదని నేను చెప్పాను. కానీ ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు సమాజంలో నా గౌరవం పోయింది. దీంతో నేను మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలను ఎదుర్కొన్నాను. 'హారన్‌ ఓకే ప్లీజ్‌' సెట్‌లో నేను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులు నన్ను భయానికి గురిచేశాయి. దీంతో నేను సినిమాలకు దూరంగా వెళ్లిపోయాను. నేను ఎంతో ఇష్టపడి వచ్చిన ఈ రంగంలో ఇబ్బందులు ఎదురవడం వల్ల షాక్‌కు గురయ్యాను. ఇది మొత్తం 12 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ సమయంలో ఓ రోజు నా కారు మీద దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నాలోని స్ఫూర్తి, ధైర్యాన్ని ఆ రోజే చంపేశారు"
- తను శ్రీ దత్తా, బాలీవుడ్​ నటి.

ఆమె గణేశ్‌ గురించి చర్చిస్తూ... 'మీ పాపాల చిట్టా నిండింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ పాపాలు బయటకు వస్తాయి' అని పేర్కొంది.

ఇదీ చూడండి...'చిరంజీవి అందుకే మెగాస్టార్ అయ్యారు'

Last Updated : Feb 28, 2020, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details