తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా జీవితాన్ని నాశనం చేసింది అతనే..! - Nana Patekar, Tanushree Dutta

బాలీవుడ్​ నటుడు నానా పటేకర్​పై మీటు కేసు పెట్టి చర్చనీయాంశంగా మారింది నటి తనుశ్రీ దత్తా. ప్రస్తుతం ఈ కేసు గురించిన ఆసక్తికర విషయాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ నటి.

Tanushree
తనుశ్రీ

By

Published : Jan 9, 2020, 6:22 PM IST

ఈ మధ్య 'మీటూ' కేసు విషయంపై మరోసారి వార్తల్లోకి వచ్చింది బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా. ఏడాదిన్నర కిత్రం బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల కేసు వేసిందీ నటి. అది కోర్టు విచారణలో ఉంది. అయితే దీనికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

"ఇదంతా జరగడానికి, తన జీవితం, ఉపాధి నాశనమవ్వడానికి కారణం కచ్చితంగా కొరియాగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యనే. 2008లో 'హార్న్‌ ఓకే ప్లిజ్‌' చిత్రం షూటింగ్‌ సయమంలో పాట కోసం కొరియాగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య, నానా పటేకర్, చిత్రనిర్మాత, దర్శకుడు అందరూ ఉన్నారు. అప్పుడే నానా నాపై అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించాడు. అప్పుడు నేను అతనిపై కేసు పెట్టడానికి ప్రయత్నించాను. కానీ వాళ్లు నన్ను వారించారు. కేసు వేయకుండా భయపెట్టారు. నా జీవితం ఇలా అవ్వడానికి పూర్తిగా గణేష్‌ ఆచార్యనే కారణం. ఇందులో ఎవరినీ వదిలిపెట్టను. 2018లో నానాపై కేసు వేసిన తరువాత అతనికి సినిమాల్లో నటించడానికి చిత్రనిర్మాతలు పాత్రలు ఇవ్వడం లేదు. అందుకే అతను మళ్లీ కేసును ఏదో విధంగా తప్పించి బయటపడాలని చూస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే అనేక మార్గాలను వెదుకుతున్నాడు. ఎప్పటికీ నేను మాత్రం ఊరికే వదలను. కొన్నాళ్లుగా నేను ఎటువంటి ఉపాధి లేక ఎంత ఇబ్బంది పడి ఉంటానో మీకే తెలియాలి."
-తనుశ్రీ దత్తా, సినీ నటి

ప్రపంచ వ్యాప్తంగా 2017లో 'మీటూ' ఉద్యమానికి తెరలేపింది అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్త తారానా బుర్కే కాగా, ఇండియాలో 'మీటూ' ఉద్యమానికి మొదలుపెట్టిన వ్యక్తిగా తనుశ్రీ దత్తాని చెపుకోవచ్చు.

గణేష్

ఇవీ చూడండి.. సినిమా రివ్యూ: ఇది రజనీ దర్బార్​..!

ABOUT THE AUTHOR

...view details