తనీశ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'మహా ప్రస్థానం'. 'జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్'.. అనేది ఉప శీర్షిక. ముస్కాన్ సేథీ నాయిక. జానీ దర్శకుడు. భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రధారులు. యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం.
ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న తనీశ్ - తెలుగు సినిమా వార్తలు
తనీశ్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'మహాప్రస్థానం'. జానీ దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
![ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న తనీశ్ తనీష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6502413-thumbnail-3x2-tan.jpg)
తనీష్
ఈ పోస్టర్లో తనీశ్ కత్తి పట్టుకుని శరీరమంతా రక్తపు మరకలతో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. కొంతమందిని చంపి ఆ శవాల మధ్య కూర్చుని ఆసక్తి పెంచుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.