ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ రావడం తెలుగుజాతికి, గాయక కుటుంబానికి గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. సంకీర్తన గ్రూప్,ఎలివేట్స్ గ్రూప్ సంయుక్తంగా సింగర్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
'ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ రావడం తెలుగుజాతికి గర్వకారణం' - sp balasubrahmanyam got padma vibhushan award
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ రావడం పట్ల.. సినీనటుడు తనికెళ్ల భరణి హర్షం వ్యక్తం చేశారు. బాలుతో మిథునం చిత్రం నిర్మించడం, దానికి మంచి పేరు తెచ్చిపెట్టడం సంతోషం కలిగించిందన్నారు.
సినీనటుడు తనికెళ్ల భరణి
హైదరాబాద్ ఎన్కేఎం హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన తనికెళ్లను నిర్వాహకులు సత్కరించారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యం కాపాడకపోతే త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా నేర్పిందన్నారు. బాలుతో మిథునం చిత్రం నిర్మించడం, దానికి మంచి పేరు తెచ్చిపెట్టడం సంతోషం కలిగించిందని తెలిపారు.
- ఇదీ చూడండి :గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం