తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆకట్టుకుంటోన్న పొలిటికల్ డ్రామా 'తాండవ్' ట్రైలర్ - సైఫ్ అలీ ఖాన్ తాండవ్ ట్రైలర్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తోన్న వెబ్ సిరీస్ 'తాండవ్'. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈనెల 15న విడుదలవనున్న ఈ సిరీస్​కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Tandav trailer
ట్రైలర్: ప్రధాని పదివి కోసం సైఫ్ ఏం చేశాడు?

By

Published : Jan 4, 2021, 7:38 PM IST

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్న పొలిటికల్ డ్రామా 'తాండవ్‌'. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ తారలు డింపుల్‌ కపాడియా, సునీల్ గ్రోవర్‌లు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది.

"వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు" అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. తన కుమారుడు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తాడని భావించిన సమర్‌ పత్రాప్‌ సింగ్‌ (సైఫ్‌ అలీఖాన్‌) తండ్రి భారత ప్రధాని దేవకి నందన్‌ (థిగ్మాన్షు ధూలియా) ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తే కావాలని కోరుకుంటాడు. అయితే ప్రధాని దేవకి నందన్‌ కన్నుమూస్తారు. దాంతో ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని సమర్‌ ప్రతాప్‌ కొత్త రాజకీయాలకు తెరలేపుతాడు. ఇన్ని చేసిన సమర్‌ ప్రధాని అవుతాడా కాదా అనేది మిగిలిన కథ.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజధాని (ధిల్లీ) నగరం చుట్టూ కథ తిరుగుతుంది. భారత రాజకీయాల్లో ఎన్నో చీకటి మార్గాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇందులో ఇంకా జీషన్ అయూబ్, కృతికా కమ్రా, కుముద్ మిశ్రా, సారా జేన్ డయాస్, డినో మోరియా, గౌహర్ ఖాన్, సంధ్య మృదుల్, అనుప్ సోని, పరేష్ పహుజా, షోనాలి నగరాణి నేహా హింగే, సుఖ్మణి సదానా తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి గౌరవ్ సోలంకి కథ రాయగా, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 15, 2021న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details