రామ్చరణ్ 'రంగస్థలం' సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన తమిళ డబ్బింగ్ వెర్షన్.. ప్రభుత్వం నిర్ణయం వల్ల వాయిదా పడింది.
తమిళ 'రంగస్థలం' విడుదలకు బ్రేక్ - Rangasthalam tamil movie hault
కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా తమిళనాడులోని సినిమా థియేటర్లను మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో డబ్బింగ్ వెర్షన్ 'రంగస్థలం' విడుదల వాయిదా పడింది.

రామ్చరణ్ రంగస్థలం
2018లో వచ్చిన 'రంగస్థలం' సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30 తమిళంలో విడుదల చేయాలని నిర్మాత భావించారు. అయితే దేశంతో పాటు తమిళనాడులోనూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఏప్రిల్ 26నుంచి తమ రాష్ట్రంలో థియేటర్లో మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చిత్ర విడుదలకు ఆటంకం కలిగింది.