తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్​లో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి - TamilNadu government about theatres

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

TamilNadu government issues GO allowing 100% occupancy in theatres
థియేటర్​లో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి

By

Published : Jan 4, 2021, 12:37 PM IST

Updated : Jan 4, 2021, 12:46 PM IST

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. సంక్రాంతి కానుకగా విజయ్ నటించిన 'మాస్టర్', శింబు 'ఈశ్వరన్' విడుదలవబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కరోనా లాక్​డౌన్ ఆంక్షల నడుమ మూతపడిన థియేటర్లు ఇటీవలే తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ 50 శాతం వీక్షకులతో థియేటర్లు నడుపుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం సీటింగ్ కెపాసిటీని 50 నుంచి 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : Jan 4, 2021, 12:46 PM IST

For All Latest Updates

TAGGED:

Vijay master

ABOUT THE AUTHOR

...view details