తమిళ టీవీ నటుడు ఇందిర కుమార్ శుక్రవారం మృతి చెందాడు. అంతకు ముందు రోజు స్నేహితుడిని కలవడానికి అతడి ఇంటికి వెళ్లిన కుమార్.. అక్కడే ఓ గదిలో పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి శవమై కనిపించాడు. దీంతో ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
టీవీ నటుడు మృతి.. ఆ విషయమే కారణమా? - టీవీ నటుడు మృతి లేటేస్ట్ న్యూస్
యువ నటుడు ఇందిర కుమార్ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు దర్యాప్తు సాగుతోంది. అయితే నటించే అవకాశాలు రాకపోవడమే కుమార్ మృతికి కారణమని తెలుస్తోంది.
టీవీ నటుడు ఆత్మహత్య.. అవకాశాలు రాకపోవడమే కారణమా?
ఇది ఆత్మహత్యేనని భావిస్తున్న పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, నటుడిగా అవకాశాలు రాకపోవడమే కుమార్ మృతికి కారణమని స్నేహితులు భావిస్తున్నారు.
ఇది చదవండి:బాలీవుడ్ నటుడు సందీప్ ఆత్మహత్య