తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శింబుకు గౌరవ డాక్టరేట్.. ​ రవితేజ సినిమాలో సుశాంత్​

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో హీరోలు శింబు, రవితేజ, వరుణ్​తేజ్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Jan 11, 2022, 6:32 PM IST

Simbhu Doctorate: తమిళ స్టార్​ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగాను తమిళనాడులోని ప్రముఖ వేల్స్​ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ఈ డాక్టరేట్​ను తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

శింబుకు డాక్టరేట్​

'రామ్'​గా సుశాంత్​

Raviteja Ravanasura movie: సుధీర్​ వర్మ దర్శకత్వంలో మాస్​ మహారాజా​ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ మూవీలో అక్కినేని మనవడు సుశాంత్​ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. రామ్​గా ఆయన పరిచయం చేస్తూ ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఇందులో రవితేజ రావణాసురుగా కనిపించనున్నారు. ఈ మూవీని అభిషేక్​ పిక్చర్స్​, ఆర్​ టి టీమ్​ వర్క్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సుశాంత్​

అనౌన్స్​మెంట్​ పోస్టర్​

Varuntej Gani movie update: హీరో వరుణ్​తేజ్ నటించిన కొత్త చిత్రం 'గని'. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్​ అనౌన్స్​మెంట్​ పోస్టర్​ను ఉదయం 11.08 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సిద్ధు, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గని

ఓటీటీలో 'స్కైల్యాబ్'​

Skylab ott release date: సత్యదేవ్‌, నిత్యామేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్కైలాబ్‌'. 2021 డిసెంబరు 4న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా అతి తర్వలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ 'సోనీ లివ్‌'లో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని సోనీ లివ్‌ తెలిపింది. ఈ వైవిధ్యభరిత సినిమాకు విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించారు. బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామేనన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తనికెళ్ల భరణి, తులసి, విష్ణు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించారు.

ఇదీ చూడండి: అలరిస్తున్న నాగ్​ 'బంగార్రాజు' ట్రైలర్​

ABOUT THE AUTHOR

...view details