దీపావళి కానుకగా విడుదల చేసిన 'మాస్టర్' సినిమా టీజర్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. 24 గంటలు పూర్తి కాకముందే 15 మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. 1.7 మిలియన్ లైక్స్‌ను ఖాతాలో వేసుకుంది. దక్షిణాదిలోనే తక్కువ వ్యవధిలోనే అత్యధిక వీక్షణలు సంపాదించిన టీజర్‌గా 'మాస్టర్' సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఫైటింగ్ సన్నివేశాలతో రూపొందించిన టీజర్.. ఆద్యంతం సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఇందులో హీరో విజయ్ ఒక స్టైలిష్, పవర్‌ఫుల్ ప్రొఫెసర్‌గా కనిపించి ఆకట్టుకుంటున్నారు.
రికార్డులతో అదరగొడుతోన్న విజయ్ 'మాస్టర్' - మాస్టర్ సినిమా టీజర్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా టీజర్.. యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. భారీ స్థాయిలో వ్యూస్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లోనే అత్యధిక లైక్స్ సంపాదించిన టీజర్‌గా ఘనత సాధించింది.
రికార్డులతో అదరగొడుతోన్న విజయ్ 'మాస్టర్'
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాళవికా మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భాగ్యరాజ్, అర్జున్ దాస్, సిమ్రన్, ఆండ్రియా, శ్రీనాథ్, సంజీవ్ గౌరీ కిషన్, వీజే రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదీ చూడండి:విజయ్ 'మాస్టర్' టీజర్ అదిరిందిగా..