ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుజామున 4:35 గంటలకు మరణించారు. నిన్న గుండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత - tamil actor vivek passed away
06:24 April 17
ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ఇదీ చదవండి:'పవన్‌ని నేను ఎప్పుడూ ఇష్టపడతా'
దాదాపు 300పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. దర్శక శిఖరం కె. బాలచందర్ చిత్రంలో తొలిసారి సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో "మనదిల్‌ఉరుది వేండం" ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యాడు. రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్యతో.. పలు చిత్రాల్లో నటించాడు వివేక్. అపరిచితుడు, శివాజీ, రోబో, సింగం, రఘువరన్ బీటెక్‌వంటి.. చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సహాయక పాత్రలతో పాటు హాస్యనటుడిగానూ ఆయన మెప్పించారు. అస్వస్థతకు ముందు ఆయన కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నారు.
ఇదీ చదవండి:మరో ప్రయోగాత్మక చిత్రంలో హన్సిక