తమిళ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికే చిన్నారుల కోసం 'అగరం ఫౌండేషన్'ను స్థాపించి పలు స్వచ్ఛంద కారక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడీ సంస్థకు సంబంధించిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఫౌండేషన్ నుంచి సహాయం పొందుతున్న గాయత్రి తన కష్టాల గురించి చెప్పింది. సంస్థ ఆదుకోవడం వల్ల సాధించిన విజయాల్ని, తన ప్రయాణాన్ని వెల్లడించింది.
"మాది చిన్న పల్లెటూరు. తండ్రి రోజూ కూలి పని చేస్తాడు. చదువుల కోసం ఫౌండేషన్ సహాయం తీసుకొని కళాశాల విద్య పూర్తి చేసుకున్నా. ప్రస్తుతం ఇంగ్లీష్ ట్రైనర్‌గా పనిచేస్తున్నా. నా విజయానికి కారణం ఫౌండేషన్" అంటూ భావోద్వేగానికి గురైంది.