తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..! - బిజిల్

విజయ్ హీరోగా తమిళంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు 'బిజిల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో ఫుట్​బాల్ కోచ్​గా కనిపించనున్నాడీ కథానాయకుడు.

విజయ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

By

Published : Jun 22, 2019, 8:31 AM IST

తమిళనాట హీరో విజయ్ క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిని ఇళయదళపతి అని ముద్దుగా పిలుచుకుంటారు. తమ అభిమాన కథానాయకుడి సినిమా వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడీ హీరో. శనివారం అతడి పుట్టినరోజు సందర్భంగా విజయ్ 63వ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఈ స్పోర్ట్స్​ డ్రామాకు 'బిజిల్' అనే టైటిల్ ఖరారు చేశారు.

విజయ్-అట్లీ కాంబినేషన్​లో ఇంతకు ముందు వచ్చిన తెరి (పోలీసోడు), మెర్సెల్ (అదిరింది) కోలీవుడ్​లో ఘనవిజయం సాధించాయి. ఇప్పుడీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఫుట్​బాల్ కోచ్​గా, వయసు మళ్లిన వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడీ హీరో.

బిజిల్ సినిమా ఫస్ట్​లుక్

రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ చిత్రం. నయనతార హీరోయిన్. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇది చదవండి: తలపతి విజయ్ కోసం 'స్టేడియం' కట్టేశారు!

ABOUT THE AUTHOR

...view details