తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తమిళ దర్శకుడు మహేంద్రన్ కన్నుమూత - cinema

ప్రముఖ తమిళ దర్శకుడు మహేంద్రన్ తుదిశ్వాస విడిచారు. 'ముల్లుమ్ మలరుమ్', 'జానీ' వంటి చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మహేంద్రన్

By

Published : Apr 2, 2019, 11:57 AM IST

Updated : Apr 2, 2019, 12:46 PM IST

ప్రముఖ తమిళ దర్శకుడు జె.మహేంద్రన్ (79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఈరోజు ఉదయం ఇంటివద్ద తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దర్శకుడు మహేంద్రన్ తమిళంలో ఎన్నో భారీ చిత్రాలను తెరకెక్కించారు. ముల్లుమ్ మలరుమ్, జానీ వంటి చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

దాదాపు ఎనభై సినిమాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్ 2 సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన మరణవార్తతో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

తొలుత రచయతగా సినీ పరిశ్రమకు వచ్చి అనంతరం 1978లో 'ముల్లుమ్ మలరుమ్'​తో దర్శకుడి అవతారమెత్తారు మహేంద్రన్​. ఈ సినిమా సూపర్​స్టార్​ రజీనీకాంత్ కెరీర్​కు ఊపిరిపోసిందని చెప్పొచ్చు. తర్వాత రజినీతో కాళీ, జానీ చిత్రాలు తీశారు.

'ఉత్తిరి పూక్కల్' (1979), 'నేన్జతై కిల్లాతే' (1980) సినిమాలు మహేందర్​కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశారు.. కామరాజ్ (2004),పెట్టా, తేరి చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇవీ చూడండి..ఇజ్జూ.. నిన్ను తినేయాలని ఉంది: పరిణీతి

Last Updated : Apr 2, 2019, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details