తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​లో తమిళ చిత్రం రికార్డు

తమిళ చిత్రం 'కూజంగల్' 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ రోటర్​డామ్​లో సత్తాచాటింది. ఈ వేడుకలో టైగర్ అవార్డు సాధించిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.

koozhangal wins Tiger Award
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​లో తమిళ చిత్రం రికార్డు

By

Published : Feb 8, 2021, 1:22 PM IST

50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌లో(ఐఎఫ్ఆర్ఆర్) తమిళ చిత్రం 'కూజంగల్' 'టైగర్' అవార్డు ద‌క్కించుకుంది. తద్వారా ఈ పురస్కారం ద‌క్కించుకున్న తొలి త‌మిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని పీఎస్ వినోద్ రాజ్ తెర‌కెక్కించారు. నయనతార విఘ్నేష్‌ శివన్‌ కలిసి రౌడీ పిక్చర్‌ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. చిత్రానికి టైగ‌ర్ అవార్డు ద‌క్క‌డం పట్ల సంతోషం వ్యక్తం చేసింది చిత్రబృందం.

ఈ అవార్డు ద‌క్కించుకున్న రెండో భారతీయ చిత్రం 'కూజంగల్'. 2017లో సనల్ కుమార్ శశిధరన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం 'సెక్సీ దుర్గా' మొదటిసారిగా ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details