స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా మేకింగ్‌తో పాటు, పాటలూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మాటల మాంత్రికుడు.. తమిళ స్టార్ సూర్యతో ఓ సినిమా రూపొందించనున్నట్లు సమాచారం. ఇటీవలే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వినిపించగా.. అది నచ్చడం వల్ల దీనిని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సూర్య, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా? - latest surya movie updates
'అల వైకుంఠపురములో' సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు తమిళ స్టార్ సూర్యతో ఓ ఫ్యామిలి డ్రామా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
సూర్య ఎప్పుడూ విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తయిన తర్వాత.. 2021లో త్రివిక్రమ్ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సూర్య నటించిన 'సూరారై పొట్రు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుధ కొంగర దర్శకత్వం వహించారు. జిఆర్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఇందులో టాలీవుడ్ విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.