బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్.. 'దబాంగ్-3'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది ఈద్‌కు 'రాధే' అంటూ పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
సల్మాన్‌కు విలన్‌గా మరో దక్షిణాది నటుడు! - Radhe latest news
సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాధే' చిత్రంలోని ఓ కీలక పాత్రలో తమిళ నటుడు భరత్ కనిపించనున్నాడు. అతడు ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని సమాచారం.
భరత్-సల్మాన్‌ఖాన్
'దబాంగ్' మూడో భాగంలో కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. 'రాధే'లో తమిళ నటుడు భరత్(ప్రేమిస్తే ఫేమ్) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్లో పంచుకున్నాడు భరత్. అయితే ఇందులో ఇతడు విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం.
'రాధే'లో దిశా పటానీ, రణ్‌దీప్ హుడా, జాకీష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు. 'దబాంగ్-3'తో పాటు ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు.