తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గ్లామర్ నుంచి ఘోస్ట్​ పాత్రలకు మారిన మిల్కీబ్యూటీ! - horror

గ్లామర్ పాత్రల నుంచి హర్రర్ పాత్రలను ఎంచుకుంటోంది తమన్నా. ఇప్పటికే అభినేత్రి 2, ఖామోషి చిత్రాలతో భయపెట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలో రాజుగారిగదితో ప్రేక్షకులను అలరించనుంది.

తమన్నా

By

Published : Jun 21, 2019, 4:04 PM IST

తమన్నా.. గ్లామర్​ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే ఈ అమ్మడు ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. హర్రర్, థ్రిల్లర్​ కథాంశాలే ఎక్కువగా ఎంచుకుంటూ.. వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే దేవి 2(అభినేత్రి 2), ఖామోషి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా రాజుగారి గది-3లోనూ అవకాశం దక్కించుకుంది.

దేవి 2 హర్రర్ చిత్రం కాగా.. హిందీలో వచ్చిన ఖామోషి సైకో థ్రిల్లర్​. ఇప్పుడు రాబోతున్న రాజుగారి గది మూడో భాగం కూడా హర్రర్​ నేపథ్యంలోనే తెరకెక్కబోతుంది. అంతేకాకుండా 2017లో తెలుగులో హిట్టైన హర్రర్​ కామెడీ ఆనందో బ్రహ్మ తమిళ రిమేక్​లో ప్రధాన పాత్రలోనూ నటిస్తోంది తమన్నా.

ఇలా ఈ ఏడాది తాను నటిస్తున్న 70 శాతం చిత్రాలు హర్రర్, థ్రిల్లర్​ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్​2 చిత్రంతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది మిల్కీ బ్యూటీ.

ఇది చదవండి: 'పునాదిరాళ్ల'తో బలమైన పునాది వేసిన మెగాస్టార్​

ABOUT THE AUTHOR

...view details