తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవార్డు రాజకీయాలపై తమన్నా కీలక వ్యాఖ్యలు - latest cinema news

సుశాంత్ మృతితో బాలీవుడ్​లో బంధుప్రీతిపై వివాదం చెలరేగిన వేళ.. టాలీవుడ్​ హీరోయిన్ తమన్నా మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవార్డు కార్యక్రమాల్లో ఏ విధంగా రాజకీయాలు జరుగుతాయో తెలిపింది.

Tamannaah's comments on politics in award shows
తమన్నా

By

Published : Jul 25, 2020, 2:41 PM IST

జూన్​ 14న బాలీవుడ్​ స్టార్​ సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యతో.. నెపోటిజమ్​పై చెలరేగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్తవారికి అవకాశాలు రాకుండా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టాలీవుడ్​ ప్రముఖ హీరోయిన్​ తమన్నా మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

ప్రముఖ అవార్డు షోలను కొంతమంది ఏ విధంగా ప్రభావితం చేస్తారనే విషయంపై స్పందించింది. తమన్నా చాలాసార్లు నామినేట్​ అయినప్పటికీ.. తన కెరీర్​లో కొన్ని అవార్డులను మాత్రమే దక్కించుకుంది. "ఇలాంటివి ఎన్ని జరిగినా కళాకారులను ఏ మాత్రం ప్రభావితం చేయలేవని.. అభిమానుల నుంచి వచ్చే ఆదరణ తగ్గించలేరని నేను ఒకానొక సమయంలో తెలుసుకున్నా. నా సినిమాలు నాకు సంతృప్తికరంగా ఉండి.. ప్రేక్షకులు మెచ్చినప్పుడు అంత కంటే కావాల్సింది ఇంకేముంటుంది" అంటూ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details