మిల్కీ బ్యూటీ తమన్నా(tamanna beauty tips) కురుల పోషణపై మిక్కిలి శ్రద్ధ పెడుతుంది. మరి కురులను అందంగా ఉంచుకునేందుకు ఆమె ఏం చేస్తుందంటే..
అలల్లాంటి తన అందమైన కురుల కోసం ఉల్లి రసాన్ని ఉపయోగిస్తుందట. కొబ్బరినూనె, ఉల్లిరసం కలిపి ఆయిల్‌ను స్వయంగా తయారు చేసుకుంటుంది. అదెలాగో మనమూ చూద్దాం.
తమన్నా 'కురుల' సీక్రెట్ అదే.. అర కప్పు కొబ్బరినూనెలో ఒక ఉల్లి పాయను మిక్సీ పట్టీ రసం తీసి కలపాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. ఈ నూనె పట్టించిన తరువాత కచ్చితంగా అరగంటకు తలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందట.
ఇదీ చదవండి:
ఆ విషయంలో చాలా బాధేసింది: గోపిచంద్