తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇక్కడ ప్రతిభ, విజయాలే మాట్లాడతాయి' - తమన్నా తాజా వార్తలు

తన అందంతో అందరి మనసులు దోచిన నటి తమన్నా. తెలుగులో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తోంది. అయితే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే బ్యాగ్రౌండ్ ఉండాల్సిన పని లేదని అంటోంది.

తమన్నా
తమన్నా

By

Published : Sep 18, 2020, 6:21 AM IST

తన అందంతో అందరి మనసులు దోచిన నటి తమన్నా. తెలుగులో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తోంది. అయితే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే బ్యాగ్రౌండ్ ఉండాల్సిన పని లేదని అంటోంది.

"బ్యాగ్రౌండ్‌ ఉన్న వాళ్లే చిత్ర పరిశ్రమలో రాణిస్తారన్న మాట నేను నమ్మను. ఏ చిత్రసీమలో ఎదగడానికైనా బోలెడన్ని అవకాశాలున్నాయి. వాటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలంతే. నా వెనక సినిమా వాళ్లెవరూ లేరు. కానీ, ఇన్నేళ్లుగా వరుస అవకాశాలతో సినీ ప్రయాణం కొనసాగిస్తున్నా కదా. నేనేంటి? సమంత, అనుష్క, కాజల్‌, పూజాహెగ్డే వీళ్లెవరూ.. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు కాదు. కానీ, తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ఇమేజ్‌ని సృష్టించుకున్నారు. ఇక్కడ ప్రతిభ, విజయాలే మాట్లాడతాయనడానికి మేమే నిదర్శనం."

ABOUT THE AUTHOR

...view details