చిత్రపరిశ్రమలో హీరోయిన్లకు ఎవరితో వారికే పోటీ ఉంటుందని అంటోంది నటి తమన్నా భాటియా. తోటి నటీమణులను చూసి అసూయపడే తత్వం తనది కాదని చెబుతోంది. తెలుగులో కాజల్, సమంత, అనుష్కలతో మంచి అనుబంధం ఉందని తెలిపింది. సినీ పరిశ్రమలో పోటీని మీరు ఎలా స్వీకరిస్తారనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చింది.
'వాళ్ల ఎదుగుదల చూసి అసూయపడను' - tamannaah
సినీపరిశ్రమలో హీరోయిన్ల మధ్య పోటీ ఉండదని, ఎవరితో వారికే పోటీ అని చెబుతోంది ప్రముఖ నటి తమన్నా. పోటీ అనే పదానికి తమ మధ్య చోటుండదని చెబుతోంది.
చిత్ర పరిశ్రమలోని పోటీ వాతావారణాన్ని ఎలా స్వీకరిస్తుంటారు?
తమన్నా: ఏ చిత్ర పరిశ్రమలోనైనా సరే.. కథానాయికలకు కొరత ఎప్పుడూ ఉండదు. నదిలోకి ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి చేరినట్లు.. చాలా మంది ప్రతిభావంతులు వస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరితో వారికే పోటీ. నేనెప్పుడూ మరొకరు నాకు పోటీ ఏమో అనే ఆలోచన రానివ్వను. నా చిత్రాన్ని ఎవరైనా ఎగరేసుకుపోతుంటారేమో అన్న బెంగ ఉండదు. అలాగే మరో కథానాయికకు హిట్టు పడింది కదా అని అసూయపడను. ఎందుకంటే మేం శత్రువులం కాదు.. స్నేహితులం. తెలుగులో కాజల్, సమంత, అనుష్క ఇలా చాలామంది మంచి స్నేహితులున్నారు. మేం ఒకరి విజయాల్ని మరొకరం ఆస్వాదిస్తాం. పోటీ అనే పదానికి మా మధ్య చోటుండదు. ఓ శుక్రవారం నాలుగు చిత్రాలు విడుదలైతే.. అందులో ఒక్కటే ఆడాలని ఏం లేదు. నాలుగూ ఆడొచ్చు. నాలుగూ ఆడకపోవచ్చు కదా. అలాంటప్పుడు పోటీ అనే ప్రస్తావన ఎక్కడ వస్తుంది.