చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం బాలీవుడ్ 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పవన్ 'వకీల్ సాబ్' చిత్రంలో తమన్నా!
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'వకీల్ సాబ్' టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఈ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. మరి అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది.