మిల్కీబ్యూటీ తమన్నా ఈ సారి కబడ్డీ కోచ్‌గా ప్రేక్షకులను అలరించనుంది. టాలీవుడ్ నటుడు గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సీటీమార్'. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. తాజాగా తమన్నా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో జ్వాలారెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా కనిపించనుంది తమన్నా. 'ఒక ఫైర్.. కబడ్డీ కోచ్ అయితే ఇలా ఉంటుంది' అని ఫస్ట్‌లుక్‌లో పేర్కొంది.
ఫైర్ బ్రాండ్.. కబడ్డీ కోచ్‌గా మారితే..! - కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా
కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సీటీమార్'. సంపత్‌నంది దర్శకత్వంలో గోపిచంద్, తమన్నా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. తాజాగా హీరోయిన్ తమన్నా పాత్రను పరిచయం చేస్తూ మరో లుక్‌ను విడుదల చేసింది.
ఫైర్ బ్రాండ్.. కబడ్డీ కోచ్‌గా మారితే..!
గతేడాది విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో లక్ష్మీగా అలరించి.. ప్రేక్షకులను మెప్పించింది నటి తమన్నా. సినిమాలో ఆమె నటనను సినీ ప్రముఖులు, సినీ ప్రియులు ప్రశంసించారు. అంతేకాకుండా ఈ ఏడాది మహేశ్ కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో పార్టీ సాంగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది మిల్కీబ్యూటీ.
ఇదీ చూడండి..విజయ్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి: కేథరిన్
Last Updated : Feb 29, 2020, 3:18 PM IST