పవర్‌స్టార్‌కు తమన్ 5స్టార్ ఇచ్చారు. స్వాగ్.. స్టైల్ అంటూ వకీల్‌సాబ్‌లోని పవన్‌కల్యాణ్ లుక్‌ను తమన్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
హీరోయిన్ కీర్తి సురేశ్ అన్ని విషయాలు ఎవరితో పంచుకుంటుందో తెలుసా.? తన పెంపుడు శునకంతోనట. కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఒక ఫొటోను పంచుకొంటూ ఈ విషయం చెప్పిందామె.
నటి నిషా అగర్వాల్ తన ముద్దుల కుమారుడిని హత్తుకొని దిగిన ఫొటోను పోస్టు చేసింది. ఇదే సండే ప్లాన్ అంటూ రాసుకొచ్చింది.
మహేశ్ సతీమణి నమ్రత సాహసాలు చేసేందుకు వెళుతున్నారు. దుబాయ్ డైరీస్ పేరుతో ఆమె ఒక వీడియోను పంచుకుంది.
'కెవ్వుకేక'తో ఉర్రూతలూగించిన మలైకా ఆరోరా సిగ్గుపడుతోంది. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ఒక ఫొటోను ఆమె పోస్టు చేసింది.