తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కిక్​' జోడి మరోసారి.. ఫ్యాన్స్​కు పండగే! - టాలీవుడ్​ వార్తలు

'కిక్'​ సినిమాతో క్రేజీ కాంబినేషన్​ అనిపించుకున్న మాస్​ మహారాజ రవితేజ, ఇలియానా జోడీ మరోసారి కలిసి అలరించేందుకు సిద్ధమయ్యారట! ప్రస్తుతం ఈ విషయం గురించే నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

raviteja
రవితేజ

By

Published : Aug 16, 2021, 3:01 PM IST

Updated : Aug 16, 2021, 3:38 PM IST

మాస్​ మహారాజ రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా కలిసి మరోసారి నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. 'ఖతర్నాక్','కిక్'​, 'దేవుడు చేసిన మనుషులు', 'అమర్​ అక్బర్​ ఆంథోనీ' సినిమాలతో ఇప్పటికే వెండితెరపై నాలుగుసార్లు అలరించిన ఈ జోడీ.. మరోసారి తెరపై కనువిందు చేయనున్నారట! అయితే ఈసారి ఇలియానా ప్రధాన పాత్రలో నటించట్లేదని.. కేవలం కొద్ది నిమిషాలు తళుక్కుమంటుందని సమాచారం. రవితేజ నటిస్తున్న 'రామారావు' చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మాస్​మహారాజ సరసన ఈ భామ ఆడిపాడనుందని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే నిజమైతే అటు మాస్​మహారాజ ఫ్యాన్స్​తో పాటు ఇలియానా అభిమానులకూ పండగే.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'రామారావు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. హీరోయిన్లుగా దివ్యాంశ కౌశిక్​, రజిష విజయన్​ అలరించనున్నారు. సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరత్​ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు శ్యామ్​ సీఎస్​ బాణీలను సమకూరుస్తున్నారు.

ఇదీ చదవండి :ఎన్టీఆర్ ప్రశ్న.. రామ్​చరణ్ ఫన్నీ ఆన్సర్

Last Updated : Aug 16, 2021, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details