తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తఖ్త్' చిత్రానికి రంగం సిద్ధమైందా..? - ఆలియా భట్

బాలీవుడ్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తఖ్త్'. కరణ్ జోహర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

ఆలియా

By

Published : Sep 16, 2019, 11:27 AM IST

Updated : Sep 30, 2019, 7:31 PM IST

బాలీవుడ్​ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్​ జోహర్​ 'తఖ్త్'​ పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. పిరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులు గడుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ త్వరలోనే సెట్స్​ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న రణ్​వీర్ సింగ్, ఆలియా భట్​.. నిర్మాత కరణ్​ జోహర్​ ఆఫీస్​కు వెళ్లి కలిశారు. ఆలియా తన ఇన్​స్టాలో పంచుకున్న ఓ ఫోటో ఈ అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఆలియా పోస్ట్

ఈ సినిమాలో కరీనా కపూర్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, భూమి పడ్నేకర్ మరిన్ని పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై బాలీవుడ్​లో భారీగానే అంచనాలున్నాయి. 'తఖ్త్' అంటే హిందీలో సింహాసనం అని అర్థం.

ఇవీ చూడండి.. 'మాస్ సినిమా రుచి ఏంటో వాల్మీకితో తెలిసింది'

Last Updated : Sep 30, 2019, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details