మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేసే క్షణం కోసం కుటుంబంలోని ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో తమ ఇంట్లో జరగనున్న మొదటి శుభకార్యం కావడం వల్ల ఈ వివాహ వేడుక ప్రతి ఒక్కరికీ ఓ మధుర జ్ఞాపకంగా ఉండేలా నాగబాబు ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆసియాలోనే ది బెస్ట్ హోటల్‌గా పేరొందిన ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను పరిణయ వేదికగా ఎంపిక చేసింది.
నిహారిక-చైతన్యల పరిణయ వేదికను చూశారా? - నిహారిక పెళ్లి వేదిక
కొణిదెల నిహారిక - చైతన్య జొన్నలగడ్డ వివాహ వేదిక నిశ్చయమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ విలాస్ ప్యాలెస్‌లో పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విలాసమంతమైన ప్యాలెస్ ఫొటోలు మీకోసం.

డిసెంబర్ 9న వివాహం జరగనుండడం వల్ల ఇప్పటికే నిహారిక-చైతన్య వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఉదయ్ విలాస్ ప్యాలెస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక ఇటీవల షేర్ చేసిన ఓ ఫొటోనే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోనే ది బెస్ట్ ప్యాలెస్ హోటల్స్‌లో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్‌విలాస్‌లో ఇటీవల ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఈశా సంగీత్ వేడుక జరిగింది. ఈ క్రమంలో నిహారిక-చైతన్య పెళ్లి నేపథ్యంలో సదరు హోటల్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్ ఎలా ఉంటుందో చూడాలని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌కు సంబంధించిన సోషల్‌మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఫొటోలు ఆధారంగా ఆ హోటల్ ఎలా ఉంటుందో చూసొద్దాం రండి..!