తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తైమూర్'​ను చూసేందుకు ఆయాకు అంత జీతమా? - bollywood news

పుట్టుకతోనే సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న తైమూర్ అలీ ఖాన్​ అలనా పాలనా చూసే ఆయాకు భారీ మొత్తమే చెల్లిస్తున్నారట. ఈ విషయమై సోషల్​ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆమె జీతమెంతో తెలుసా?

'తైమూర్'​ను చూసేందుకు ఆయాకు అంత జీతమా?
ఆయాతో తైమూర్ అలీ ఖాన్

By

Published : Jan 10, 2020, 1:11 PM IST

Updated : Jan 10, 2020, 1:26 PM IST

ఒకవేళ మీ ఇంట్లో ఓ ఆయా పనిచేస్తే ఎంత జీతమిస్తారు? మహా అయితే రూ.5 వేలు లేదంటే రూ.10 వేలు. అంతకంటే వారికి ఎక్కువ ఇవ్వకపోవచ్చు. కానీ ఒకామె ఈ పని చేస్తున్నందకు నెలకు అక్షరాలా రూ.లక్ష 50 వేలు అందుకొంటోంది. ఇంతకీ ఆమె చూస్తోందెవరినో తెలుసా? బాలీవుడ్ సినీ జోడీ సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్​ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్​ను. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇదే నిజం.

ఆయాతో తైమూర్ అలీ ఖాన్

ఇదే విషయమై కరీనా సంప్రదించగా, అది నిజమేనని తేల్చింది. అయితే ఈ జీతమే కాకుండా మిగిలిన ఖర్చులు మరో రూ.25 వేల వరకు ఆమెకు ఇస్తారని సమాచారం.

ఈ విషయమై సోషల్​ మీడియాలో పెద్దే చర్చే జరుగుతోంది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల కంటే ఆయా జీతం ఎక్కువ అంటూ ఛలోక్తులు(జోక్స్) వేస్తున్నారు.

Last Updated : Jan 10, 2020, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details