బాలీవుడ్ సినీ జోడీ సైఫ్-కరీనాల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్.. మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా పొలంలో మొక్కలు తీస్తూ, తనకు తానే వంట చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వీటిని చెఫ్ విజయ్ చౌహాన్ ఇన్‌స్టాలో పంచుకున్నారు.
తైమూర్ అలీఖాన్: పొలంలో పని.. ఆపై వంట చేస్తూ
స్టార్ కిడ్ తైమూర్ అలీ ఖాన్.. ఓ చెఫ్‌తో కలిసి పొలంలో కూరగాయలు ఏరుతూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తైమూర్ అలీఖాన్
"నా స్నేహితుడు తైమూర్ ఈజ్ బ్యాక్. మా సేంద్రీయ ఉద్యావనాన్ని ఎంతో ఇష్టపడ్డాడు. నాతో పాటు అక్కడికి వచ్చాడు. కొన్ని కూరగాయాల్ని ఏరి, తనకు తానుగా వంట చేసుకున్నాడు. అతడి ఫేవరెట్ డిషెస్ ఆకుకూరలు, సూప్స్, సలాడ్" -విజయ్ చౌహాన్, చెఫ్
ఇటీవలే 'దోస్తానా 2' షూటింగ్లో హీరో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు తైమూర్. తనతో 'కా కా కా' అని మాత్రమే ఆ చిన్నారి మాట్లాడినట్లూ చెప్పాడీ నటుడు.
Last Updated : Mar 3, 2020, 2:58 AM IST