తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తండ్రి సినిమా షూటింగ్​లో కొడుకు సందడి - తైమూర్ అలీ ఖాన్

సైఫ్​ హీరోగా నటిస్తున్న 'జవానీ జానేమాన్' షూటింగ్​లో అతడి కొడుకు తైమూర్ అలీఖాన్ సందడి చేశాడు. ఆ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

తండ్రి సినిమా షూటింగ్​లో కొడుకు సందడి

By

Published : Jun 23, 2019, 2:15 PM IST

బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీఖాన్-కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు తైమూర్‌ అలీఖాన్​ ఇప్పటికే తన చేష్టలతో సోషల్‌ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇటీవలే సైఫ్ హీరోగా నటిస్తున్న ‘జవానీ జానేమాన్‌’ సెట్‌కు వెళ్లాడు తైమూర్​. చిత్రీకరణ విరామ సమయంలో సందడి చేస్తూ అందర్ని అలరించాడు.

ఫ్యామిలీ, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నితిన్‌ కక్కర్‌ దర్శకుడు. సైఫ్‌ అలీఖాన్‌ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. టబు హీరోయిన్. ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల కానుంది.

ఇది చదవండి: 20ఏళ్ల తర్వాత సైఫ్​, టబుల 'ప్రేమానురాగం 2.0'

ABOUT THE AUTHOR

...view details