తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెన్సార్​కు ఏ1 ఎక్స్​ప్రెస్.. బాలీవుడ్ 'ఆర్ఎక్స్100' రిలీజ్ డేట్ - బాలీవుడ్ 'ఆర్ఎక్స్100' రిలీజ్ డేట్

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఏ1 ఎక్స్​ప్రెస్' చిత్రానికి సెన్సార్ బృందం క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు 'అహన్ శెట్టి' హీరోగా నటిస్తోన్న 'తడప్' సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది.

Tadap release date and A1 Express sensor report
సెన్సార్​కు ఏ1 ఎక్స్​ప్రెస్

By

Published : Mar 2, 2021, 11:26 AM IST

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్'. జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్​ ముందుకు వెళ్లిన ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ సంపాదించింది.

ఏ1 ఎక్స్​ప్రెస్

'ఆర్ఎక్స్ 100' బాలీవుడ్​ రీమేక్​గా తెరకెక్కుతోంది 'తడప్'. ఈ చిత్రంలో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్​గా చేస్తోంది. మిలన్ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్​ను తాజాగా ప్రకటించింది చిత్రబృందం. సాజిద్ నదియావాలా నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది.

తడప్

ABOUT THE AUTHOR

...view details