ఈ ఏడాది భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన తొలి పది మంది సెలబ్రిటీల పేర్ల జాబితాను విడుదల చేసింది మెక్కెఫీ సైబర్‌భద్రత సంస్థ. అందులో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు టబు(2), తాప్సీ(3), నటుడు, నిర్మాత శర్మ(4), సోనాక్షి సిన్హా(5), గాయకుడు అర్మాన్ మాలిక్(6), సారా అలీఖాన్(7), దివ్యాంక త్రిపాఠి(8), స్టార్ హీరో షారుక్ ఖాన్(9), సింగర్ అర్జిత్ సింగ్(10) స్థానాల్లో ఉన్నారు. వీరి పేర్లు ప్రమాదకరమైన వెబ్సైట్లతో అనుసంధానించి ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో ఉన్నాడని వెల్లడించింది.
ఈ ప్రముఖుల గురించి ఆన్లైన్లో శోధించేవారిని లక్ష్యం చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్, మాలిషియస్ సాఫ్ట్వేర్ ద్వారా వైరస్వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది. తద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని స్పష్టం చేసింది. వీరి గురించి శోధించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ సంస్థ సూచించింది.