కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా ఆసక్తిగా చేస్తానంటోంది ప్రముఖ నటి టబు. అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'అల వైకుంఠపురములో' అత్త పాత్ర పోషిస్తూ బిజీగా ఉందీ భామ.
"ఇలాంటి పాత్రలే చేయాలని నాకు ప్రత్యేక ప్రణాళికలు ఉండవు. కథ నచ్చితే మాత్రం ఎలాంటి పాత్ర అయినా ఆసక్తిగా పనిచేస్తా. క్యారెక్టర్ల ఎంపికపై ఎటువంటి నియమాలు పాటించకపోయినా ఎంత ఆనందంగా చేస్తున్నాననేదే నాకు ముఖ్యం". -టబు, నటి