తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ పాత్ర కోసం రూ.కోటి అడిగిందట! - నితిన్ అంధాధున్ రీమేక్

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాధున్' రీమేక్ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో పాత్ర కోసం టబును సంప్రదించగా.. భారీ పారితోషికం డిమాండ్ చేసిందని సమాచారం.

Andhadhun
Andhadhun

By

Published : Feb 25, 2020, 4:44 PM IST

Updated : Mar 2, 2020, 1:02 PM IST

నితిన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా 'భీష్మ'తో చక్కటి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో.. వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు చేసేందుకు సంతకాలు చేశాడు. ఇక తాజాగా నితిన్ మేర్లపాక గాంధీతో 'అంధాధున్‌' రీమేక్‌నూ పట్టాలెక్కించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.

కథ రీత్యా ఈ చిత్రంలో ఓ మహిళ.. విలన్‌ పాత్రలో కనిపిస్తుంది. మాతృకలో నెగెటివ్​ రోల్​లో టబు ఆకట్టుకుంది. ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను టబుతోనే చేయించాలని చిత్రబృందం ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే ఇందుకు అంగీకరించిన ఈ సీనియర్​ నటి.. ఏకంగా రూ.1 కోటి డిమాండ్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే టబు 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఆ సినిమాకు దాదాపు రూ.2కోట్ల పైన అందుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'అంధాధున్‌'లోని ఈ కీలక పాత్ర కోసం భారీగా డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. కానీ, చిత్ర నిర్మాతలు మాత్రం ఇంత మొత్తం ఆమెకు ఇచ్చుకొనేందుకు సుముఖంగా లేరట. అందుకే ఇప్పుడీ పాత్ర కోసం మరో నాయికను వేటాడే పనిలో పడిందట చిత్రబృందం. మరి ఇప్పుడా లక్కీ ఛాన్స్‌ను ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.

Last Updated : Mar 2, 2020, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details