ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. #ఏఏ19 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి టబు ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ చిత్రబృందం బుధవారం ఓ వీడియోను పంచుకుంది. ఇందులో స్క్రిప్ట్ చదువుతూ కనిపించింది. బాలీవుడ్లో ఇటీవలే 'దే దే ప్యార్ దే', 'భారత్'లో నటించి సందడి చేసిందీ భామ.
బన్నీ సినిమా సెట్లో అడుగుపెట్టిన టబు - 2020 సంక్రాంతి
త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాలో టబు నటిస్తున్నట్లు ధ్రువీకరించింది చిత్రబృందం. తొలిరోజు ఆమె సెట్లో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
బన్నీ సినిమా సెట్లో అడుగుపెట్టిన టబు
ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. నివేదా పేతురాజ్ మరో కథానాయికగా కనిపించనుంది. నవదీప్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: చిరంజీవిని కలిసిన పవన్.. అభిమానుల్లో ఆసక్తి