మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో పేరుతో పాటు మంచి సన్నిహితులను సంపాదించుకున్నానని బాలీవుడ్ నటి టబు తెలిపింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ ప్రతిఫలం ఆశించకుండా తనకు మంచి జరగాలని కోరుకునే శ్రేయోభిలాషులని కొనియాడింది.
'సల్మాన్, అజయ్‌తో బంధం ప్రత్యేకం' - బాలీవుడ్
సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లాంటి స్నేహితులు దొరకడం తన అదృష్టమని నటి టబు తెలిపింది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సాయపడే వ్యక్తిత్వం వారికి ఉందని ప్రశంసించింది.
టబు
"నా నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయపడే వ్యక్తులతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. సల్మాన్, అజయ్ ఇద్దరూ.. కుటుంబ సభ్యుల్లా జీవితంలో ఆదుకుంటారు" -టబు, బాలీవుడ్ నటి
అజయ్ దేవగణ్‌తో కలిసి హఖీఖత్, తక్షక్, దృశ్యం, ఫితూర్, గోల్మాల్ ఎగైన్.. తాజాగా 'దే దే ప్యార్ దే' సినిమాల్లో నటించింది టబు. సల్మాన్‌తో బీవీ నెం.1, హమ్ సాత్ సాత్ హే, జయహో విడుదలకు సిద్ధంగా ఉన్న 'భరత్' సినిమాల్లో పనిచేసింది.