తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2020, 12:28 PM IST

Updated : Jul 9, 2020, 1:21 PM IST

ETV Bharat / sitara

దేశంలో తొలిసారిగా ఓ సినిమాకు కరోనా బీమా

ప్రముఖ నటి తాప్సీ హీరోయిన్​గా నటిస్తున్న 'లూప్ లపేటా' సినిమాను కరోనా బీమా చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాతలు. ఈ విషయమై న్యాయ నిపుణుడితో చర్చలు జరుపుతున్నారు.

దేశంలో తొలిసారిగా ఓ సినిమాకు కరోనా బీమా
హీరోయిన్ తాప్సీ

ప్రకృతి విపత్తులు, నటీనటులు అనారోగ్యానికి గురైతే.. నష్టపోయిన ఆ మొత్తాన్ని భర్తీ చేసేందుకు నిర్మాతలు బీమా చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ కరోనా నుంచి తమ సినిమాను రక్షించుకునేందుకు బాలీవుడ్​ నిర్మాత అతుల్ కస్బేకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం న్యాయ నిపుణుడితో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ అన్ని కుదిరితే కొవిడ్-19 కోసం బీమా చేయించుకున్న తొలి భారతీయ చిత్రమిదే అవుతుంది. 'లూప్ లపేటా' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

"ఆనంద్ దేశాయ్ అనే న్యాయ నిపుణుడితో, మా సినిమాకు కరోనా బీమా చేసే విషయమై మాట్లాడుతున్నాం. మిగతా వాటిలానే కొవిడ్​ బారి నుంచి నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇన్సూరెన్స్ తప్పనిసరి అని మా అభిప్రాయం. చిత్రబృందంలోని ఎవరికైనా కరోనా సోకితే మిగతా సభ్యులందరూ క్వారంటైన్​లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో షూటింగ్ లేకపోతే జరిగే నష్టాన్ని భర్తీ చేయాలంటే ఇదే మార్గం​"

-అతుల్ కస్బేకర్, 'లూప్ లపేటా' నిర్మాత

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, మేలో.. ముంబయి, గోవాలో ఈ సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో దేశం మొత్తం లాక్​డౌన్ విధించడం వల్ల అది కాస్త నిలిచిపోయింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ చేశారు. ఇటీవలే ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వర్షకాలం తర్వాత షూట్ మొదలుపెట్టాలని ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. అన్ని కుదిరితే దీపావళి తర్వాత సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

Last Updated : Jul 9, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details