బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్న 'సియా జియా' చిత్రంలో తాప్సీ పన్ను ద్విపాత్రాభినయం చేయనుందట. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వైవిధ్యకర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
షబినా ఖాన్.. భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరిద్దరూ గతంలో అక్షయ్ కుమార్ నటించిన 'రౌడీ రాథోడ్' చిత్రానికి కలిసి పనిచేశారు.